నానీతో మరో సినిమా చేయాలంటున్న నాగ్‌

11:25 - September 21, 2018

నాగార్జున, నానీల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం దేవదాస్‌ ఈ నెల 27న విడుదల కానుంది. అంటే ఇంకా ఒక వారం వుందనమాట. అయితే ఇంతకన్నా ముందుగానే నిన్న రాత్రి ' దేవదాస్‌ -టీమ్‌' ఆడియో ఫంక్షన్‌ జరిపారు.  ఫుల్ ఆల్బమ్ ను రిలీజ్ చేయడం తో పాటుగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ...నానీని పొగడ్తలతో ముంచెత్తారు. అదే సందర్భంలో నానీని మరో సినిమాకు లాక్‌ చేశారు. 

మల్టిస్టారర్ చేస్తే నాని తో చేయాలని ఎప్పటినుంచో అనుకుకుంటూ ఉన్నాను..ఎందుకంటే  దేర్ ఈజ్ సంథింగ్ నైస్ అబౌట్ యు.  స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు నాని ని కాపాడాలనిపిస్తుంది.  ఈ సినిమాలో కూడా అటువంటి రోలే ఇచ్చారు..  యువర్ డైలాగ్ డెలివరీ ఈజ్ సో బ్యూటీఫుల్.. డైలాగ్స్ అలా స్మూత్ గా వచ్చేస్తాయి. ఎదో పాట విన్నట్టు.. నీకు చక్కటి వాయిస్ ఉంది.  నాని తో చేస్తే బాగుంటుందని అనుకున్నాను.. ఈ సినిమాలో చేశాను.  నాని.. థ్యాంక్ యు ఫర్ బీయింగ్ మై కొ స్టార్.  నీతో పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. యూ ఆర్ ఎ వండర్ఫుల్ కో స్టార్. ఏంటి నాని దీనికి సీక్వెల్ చేద్దామా?... చేద్దాం!" .

నాగార్జున గారు తన గురించి మాట్లాడినంత సేపూ నానీ ముసి ముసి నవ్వులు నవ్వుతూ వున్నారు. నాగార్జున లాంటి సీనియర్ స్టార్ నుండి ఈ రేంజ్ లో అభిమానం పొందడం అనేది నాని లాంటి ఈ జెనరేషన్ స్టార్ కు దీవెనల లాంటివే.  ఎంతో టాలెంట్ ఉంటే తప్ప నాగార్జున అలా స్టేజ్ మీదే మరో సారి కలిసి పనిచేద్దామా అని అడగరు.