నాగార్జున్‌తో బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫైనల్‌

14:14 - September 11, 2018

బిగ్‌ బాస్‌ 2 పైనల్‌ స్టేజ్‌కు వచ్చింది. హౌజ్‌లో కూడా ఇంకా 6 మంది మాత్రమే మిగిలారు. ఈ నెలాకరుకి బిగ్‌ బాస్‌ 2 ముగియనుంది. అయితే బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫైనల్‌ మరింత గ్రాండ్‌గా అవబోతుంది. ఎందుకంటే ఫైనల్‌కు నాగార్జున గారు రాబోతున్నారు.

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫైనల్‌కు `మీలో ఎవరు కోటీశ్వరుడు` హోస్ట్ నాగార్జున అయితే బావుంటుందని అలోచించారట. అటు నాగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని తెలుస్తోంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్స్ కి నాగార్జున విచ్చేస్తున్నారు. పనిలో పనిగా తన సినిమా `దేవదాస్` రిలీజ్ నెలాఖరున (సెప్టెంబర్ 27న) ఉంది కాబట్టి..  బిగ్ బాస్ హౌస్ లోనే నాగార్జున ప్రమోషన్స్ ప్లాన్ చేశారట. మీలో ఎవరు కోటీశ్వరుడు తర్వాత నాగ్ మళ్లీ ఇప్పుడే ఇలా బుల్లితెరపైకి అడుగుపెడుతున్నారు. అతిధిగా బిగ్బాస్ గ్రాండ్ ఫైనల్స్ని రక్తి కట్టించనున్నారు.