నల్లడబ్బేదీ? అంటూ...డబ్బులను ఆరేసి...మోడీని ఉతికేస్తున్నారు

16:17 - November 30, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ప్రచారానికి పట్టుమని వారం రోజులు కూడా లేవు. అయితే అన్ని పార్టీల వారూ ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. పార్టీల ముఖ్యనేతలతో సభలు పెట్టించి ఓట్లెయమంటున్నారు. ఇదిలా వుంటే బీజేపీకి తెలంగాణలో ఉనికి చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలను ఏర్పాటు చేసి ప్రచార సభలు పెడుతుంది. ఈ సభలకు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలు హాజరవుతున్నారు. అయితే వీరు ఒక విడత రాష్ట్రంలో మీటింగ్‌ షురూ చేశారు. మళ్లీ మీటింగ్‌లు పెట్టడానికి సన్నాహాలు సిద్దం చేస్తున్నారు. వీళ్ల తీరున వీల్లుంటే ప్రజలు మాత్రం మోడీని ఉతికేస్తున్నారు. ఎందుకంటారా? అసలు విషియానికి వస్తే...గడిచిన 2014 ఎన్నికల్లో మోడీ అమిషాలు స్విస్ బ్యాంకుల్లో దాగిన నల్లడబ్బును వెలికి తీస్తామని.. పేదల ఖాతాల్లో వేస్తామని భీషణ వాగ్ధానాలు చేశారు. గద్దెనెక్కాక ఆ విషయం మరిచిపోయారు. బ్లాక్ మనీ తేవడం కోసం చేసిన ‘నోట్ల రద్దు ’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  దీంతో నల్లధనంపై భారీ ఆశలు పెట్టుకున్న మోడీ - షాలు ఖంగుతిన్నారు..  ఎన్నికల్లో మళ్లీ ప్రచారానికి అమిత్ షా - మోడీలు వస్తున్నారు. కానీ ఒక్క ప్రచార సభల్లోనూ నల్లడబ్బును తిరిగితెస్తామని.. పేదలకు పంచుతామన్న హామీనే ప్రస్తావించడం లేదు.. కనీసం వాటి గురించి చెబుతున్న పాపాన పోవడం లేదు.  దీంతో కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు తాజాగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నోట్లను బట్టలు ఆరేసినట్టు దండానికి ఆరేసి ఇవి వేస్ట్ అన్నట్టున్న ఫొటోను విడుదల చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారాయి.  ఫొటోను షేర్ చేస్తూ రాజకీయ కార్యకర్తలు సామాన్య ప్రజానీకం బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.. ‘కొత్త నోట్లను ప్రవేశపెట్టి మోడీ గులాబీ డబ్బు పసుపు డబ్బు ఆరెంజ్ డబ్బు బ్లూ డబ్బు గ్రీన్ డబ్బును అందుబాటులోకి తెచ్చాడని.. కానీ నల్ల డబ్బు ఏమైంది’ అంటూ చాలామంది సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ‘కొత్త కరెన్సీ నోట్లు చాలా మెరుస్తున్నవి.. ఈ రంగులు చాలా బాగున్నవి.. కానీ ఒక కలర్ మాత్రం మిస్ అయ్యింది. అది నలుపు రంగు.. ఆ నల్లడబ్బును వెనక్కి తీసుకొస్తానని హామీ ఇచ్చి మరిచిపోయావా మోడీ’ అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇలా కొత్త నోట్టను ఆరేసి...మోడీని ఉతికేస్తున్నారు.