నన్ను రౌడీ అంటూ పబ్లిసిటీ చేస్తున్నారు...హీరో నిఖిల్‌

13:30 - September 5, 2018

సక్సెస్ - ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వస్తున్న హీరో నిఖిల్‌. హీరోగా ఇప్పటికే ఒక స్థాయి క్రేజ్ను దక్కించుకున్న నిఖిల్ గురించి మీడియాలో అప్పుడప్పుడు పుకార్లు వస్తూనే వున్నాయి. తాజాగా.. హీరో నిఖిల్ రియల్ లైఫ్ లో రౌడీ వేషాలు వేస్తున్నాడు అంటూ కొన్ని మీడియా సంస్థల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  అయితే.. తనపై వస్తున్న ఆరోపణలను మరియు రౌడీ అంటూ వస్తున్న విమర్శలపై నిఖిల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.   కాలేజ్ లో నా తమ్ముడిని 16 మంది కలిసి ర్యాగింగ్ చేస్తు ప్రతి రోజు ఇబ్బంది పెడుతూ కొడుతున్నారు. దాంతో తమ్ముడితో కలిసి నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారిపై పోలీసుల ద్వారా చర్యలు తీసుకోవడం జరిగింది కాని వారిపై ఒక్క దెబ్బ కూడా పడలేదు అంటూ  నిఖిల్‌ చెప్పుకొచ్చాడు.

నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను అనే కోపంతో కొందరు నన్ను బ్యాడ్ చేసేందుకు ప్రయత్నించి - రౌడీ అంటూ పబ్లిసిటీ చేస్తున్నారు. నన్ను రౌడీలా మీడియాలో చూపించాలని వారు ప్రయత్నిస్తున్నారు అంటూ నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిఖిల్ ఈ విషయంలో స్టూడెంట్ ను కొట్టాడా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కూడా నిఖిల్ విషయంలో ఇలాంటి విమర్శలు - వార్తలు వచ్చాయి.