' నన్ను దోచుకుందువటే ' తో బాబు హ్యాపీ అంట...

15:18 - September 22, 2018

సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో తనే హీరోగా మొదటి ప్రయత్నంగా నిర్మించిన నన్ను దోచుకుందువటే మంచి రిపోర్ట్స్ తో పాటు పబ్లిక్ టాక్ కూడా బాగా రావడంతో సుధీర్ బాబు బాగా హ్యాపీగా ఉన్నాడు. నిన్న వివిధ వెబ్ సైట్స్ లో వచ్చిన రేటింగ్స్ తో కూడిన యాడ్ ని తన ట్విట్టర్ ద్వారా పంచుకున్న సుధీర్ ఇకపై సినిమాలు తీయడం కొనసాగిస్తాను అంటున్నాడు. నిజానికి సుధీర్ ప్లాన్ తో నిర్మాత కాలేదు. ఆ మాట తనే ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. మొదలుపెట్టిన నిర్మాత మధ్యలోనే డ్రాప్ అయితే కథ దర్శకుడు నచ్చడంతో పెట్టుబడికి సై అన్నాడు.  ఈ ఏడాది సుధీర్ చేసిన రెండు సినిమాలు సమ్మోహనం ప్లస్ నన్ను దోచుకుందువటే రెండూ మంచి ఫలితాన్ని అందుకోవడం పట్ల బాబు హ్యాపీగా ఉన్నాడు. ప్రేమ కథ చిత్రం తర్వాత గొప్పగా చెప్పుకునే సక్సెస్ ఏది లేని తరుణంలో ఒకే ఏడాది తక్కువ గ్యాప్ లో రెండూ ఆ కొరతను తీర్చేసాయి. ఇకపై కూడా సినిమాలు నిర్మిస్తాను అని చెప్పిన సుధీర్ తను హీరోగా మాత్రమే తీస్తాడా లేక ఇతర హీరోలతో కూడా ట్రై చేస్తాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి హీరోగా నిర్మాతగా డ్యూయల్ రోల్ సక్సెస్ అందుకున్న సుధీర్ కు 2018 బాగా కలిసి వచ్చింది.