నన్ను చూస్తేనే రణవీర్‌కు భయం: దీపికా పదుకొనే

13:24 - December 24, 2018

బాలీవుడ్ సెలబ్రిటీలు దీపిక పదుకొనే.. రణవీర్ సింగ్ ఇద్దరూ చాలాకాలం ప్రేమాయణం సాగించి ఈమధ్యే భార్యాభర్తలుగా మారిన సంగతి తెలిసిందే.  ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో దీపిక తన భర్త రణవీర్ సింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అదేంటో చూద్దాం...రణవీర్ ను ఎలా  హ్యాండిల్ చెయ్యాలో రణవీర్ అమ్మగారు అంజు భావ్నాని ఏమైనా సలహాలు ఇచ్చారా అని అడిగితే "లేదు.. అలాంటి సలహాలేమీ ఇవ్వలేదు కానీ 'రణవీర్ సంగతి చూసుకో' అని చెప్పారు" అంటూ ఫుల్ రైట్స్ ఇచ్చియన్ విషయాన్ని వెల్లడించింది. అంతే కాకుండా "రణవీర్ కు తన పేరెంట్స్.. సిస్టర్ కంటే కూడా నన్ను చూస్తేనే భయం" అని అసలు సీక్రెట్ బైటపెట్టింది.  అయినా ఈ ప్రపంచంలో చాలామంది పెళ్ళైన వారికి భార్య కంటే భయపెట్టే విషయం ఏముంటుంది చెప్పండి? . ఇంతకీ నిజంగానే రణవీర్ భయపడ్డాడా లేదా.. పడినట్టు సహజంగా నటిస్తూ దీపికను ఏమారుస్తున్నాడా అనేది త్వరలోనే తేలిపోతుంది లెండి. నిజం నిప్పు లాంటిది.. ఎప్పటికైనా బయటకు రావాల్సిందే!