నందమూరి బాలకృష్ణ నాకు తెలియదు: నాగబాబు

11:55 - December 10, 2018

ఇటీవల ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబును బాలయ్య బాబు గురించి అడగగా.. ఆయన వెంటనే బాలయ్య బాబు ఎవరు? ఆ పేరు ఎప్పుడూ వినలేదే! అనేశారు. ఆ తర్వాత వెంటనే సీనియర్ నటుడు బాలయ్య అయితే తెలుసు తప్ప నందమూరి బాలకృష్ణ తనకు తెలియదని చెప్పారు. అయితే నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు ఓ కారణం ఉందని అంటున్నారు కొందరు. గతంలో ఓ సారి బాలకృష్ణ.. ఓ సందర్భంలో తనకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని చెప్పారు. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషనే అయింది. పవన్ అభిమానుల్లో నిరాశను నింపింది. దీంతో దానికి సెటైర్ వేయాలనే ఉద్దేశ్యంతోనే నాగబాబు ఇలా అని ఉంటాడని చెప్పుకుంటున్నారు జనం. ఇదిలావుంటే...బాలకృష్ణ మీద ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి క్రైస్తవ ప్రచారకర్త కేఏ పాల్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఏ పాల్.. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ చెప్పటం దుమారానికి తెరలేపింది. అప్పుడు కేఏ పాల్, ఇప్పుడు నాగబాబు ఇలా మాట్లాడటం బాలయ్య అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోందని తెలుస్తోంది.