ధోనీ తొలగింపుపై..కొహ్లీ స్పందన

10:56 - November 2, 2018

యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు తగినంత సమయమివ్వాలనే ఆలోచనతోనే ధోనీ తప్పుకొన్నాడని కోహ్లీ వెల్లడించాడు. టీ20 ల్లో యువ కీపర్‌ పంత్‌కు మరిన్ని అవకాశాలు వస్తే మంచిదన్నది ధోనీ ఉద్దేశం అని కోహ్లీ అన్నాడు. టీ20 ల్లో ధోనీని తొలగించడంపై విరాట్‌ కోహ్లీ తొలిసారిగా స్పందించాడు. పొట్టి ఫార్మాట్‌ నుంచి అతడికి ఉద్వాసన పలికారనడం సరికాదని స్పష్టం చేశాడు. వన్డేల్లో అతడు జట్టు అంతర్భాగమని, వచ్చే ప్రపంచక్‌పలో ధోనీ ఆడతాడని తేల్చి చెప్పాడు. నాకు తెలిసి ధోనీ విషయాన్ని ఇదివరకే సెలెక్టర్లు తెలిపారనుకుంటు న్నా. అందుకే మరోసారి నేను వివరణ ఇవ్వాలనుకోవడం లేదు. ఆ జట్టు ఎంపికలో కూడా నేను పాల్గొనలేదు. కానీ జట్టులో ఇప్పటికీ ధోనీ అంతర్భాగమే. వన్డే సిరీస్‌లో రాయుడు, ఖలీల్‌ హైలైట్‌గా నిలిచారన్నాడు.