ధోనీని తప్పించడం కరక్టేనట!

10:19 - November 1, 2018

వెస్టిండీస్‌, ఆస్ర్టేలియా సిరీస్‌లకు టీ20ల నుంచి మహేంద్రసింగ్‌ ధోనీని తప్పించడం తనకు పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ' కొన్నాళ్లుగా ధోనీ ప్రదర్శన చూస్తుంటే, అతడిని టీ20లకు జట్టులోకి తీసుకోకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. 2020 టీ20 ప్రపంచకప్‌ వరకు ధోనీ ఆడతాడని నేను అనుకోను. అందుకే, ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌కు సెలెక్టర్లు అవకాశమిచ్చి ఉంటారు '  అని ఓ జాతీయ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ చెప్పుకొచ్చాడు. కానీ..ధోనీని తప్పించడంపై ఓవైపు అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే మాత్రం ధోనీని తప్పించలేదని.. అతనికి విశ్రాంతి ఇచ్చామని పేర్కొనడంపైనా దాదా స్పందించాడు. ఒకవేళ ధోనీని వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌లో ఆడించాలంటే మాత్రం.. ఈలోపు అతన్ని వీలైనన్ని దేశవాళీ మ్యాచ్‌లు ఆడించాలన్నాడు.