ధృవ్ యువర్‌ గ్రేట్‌...

12:05 - September 25, 2018

ఇటీవల వరదల బీభత్సానికి కేరళా రాష్ట్రంకి జరిగిన నష్టం అందరికీ తెలిసిందే.  అక్కడి ప్రజల ధీనస్థితిని చూసిన యావత్ భారత దేశం చలించి పోయింది. దాని కోసమని అందరూ సహాయనిధులను పంపడం జరిగింది. అయితే తాజాగా కేరళ బాధితుల సహాయార్థం తన మొదటి సినిమా పారితోషికం మొత్తాన్ని సీఎం సహాయనిధికి అందజేశాడు విక్రమ్ తనయుడు ధృవ్. కేరళ సీఎం ను నేరుగా కలిసి ఆయన చెక్కు అందించాడు. కాగా తన మొదటి సినిమా పారితోషికం మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం అందించటం అనేది చాలా గొప్ప విషయం అంటూ.. ధృవ్‌ని అంతా మెచ్చుకుంటున్నారు. 

తెలుగులో సూపర్ హిట్ సాధించిన ' అర్జున్ రెడ్డి ' సినిమాను '  వర్మ ' పేరుతో తమిళంలో రీమేక్ చేస్తున్నారు. బాలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే ధృవ్ వెండితెరపై కాలుమోపుతున్నాడు.