ధర తగ్గిన నోకియా స్మార్ట్‌పోన్‌

12:25 - August 22, 2018

నోకియా 6.1 ధరను 1500 రూపాయలు తగ్గిస్తున్నట్టు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించింది. నోకియా 6.1 ప్లస్‌ మరికొన్ని రోజుల్లో భారత్‌లో లాంచ్‌ కాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు ముందు నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసే హెచ్‌ఎండీ గ్లోబల్‌, నోకియా 6.1/నోకియా 6(2018) స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గించింది. ఏప్రిల్‌లోనే నోకియా 6.1 భారత్‌లోకి వచ్చింది.  3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌, 4జీబీ/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయింది.

లాంచింగ్‌ సందర్భంగా దీని ధర 16,999 రూపాయలు ఉండగా... ధర తగ్గించిన అనంతరం 15,499 రూపాయలుగా ఉంది. 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర లాంచింగ్‌ సందర్భంగా 18,999 రూపాయలు ఉండగా.. ధర తగ్గింపు తర్వాత 17,499 రూపాయలుగా నిర్ణయించింది. నోకియా 6.1 వేరియంట్ల కొత్త ధరలు కంపెనీ ఇండియా సైట్‌లో చూడవచ్చు.