దేవా వుంటే దాస్‌ వున్నట్టే !

12:39 - August 29, 2018

రీసెంట్‌గా రిలీజ్‌ అయిన టీజర్‌లో అసలు ఈ దేవా కథేంటి? ఆయన వెంట దాస్ కథేంటో! ఆ ఇద్దరి కథేంటో  ఎంతో ముచ్చటగా చూపించేశారు. ఆయనెక్కడో ఈయనా అక్కడ మస్ట్ గా ఉంటాడని అర్థమైంది. 


నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కొత్త స్టిల్స్ ని యూనిట్ రివీల్ చేసింది. దేవదాస్ టీమ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లను రివీల్ చేసింది. నిన్న రివీల్ చేసిన పోస్టర్ లో నాగార్జున ఒక్కరే స్టైల్ గా హాలీవుడ్ స్టార్ లా కౌబోయ్ గెటప్ లో కనిపించారు. అరే ఈ పోస్టర్ లో దాసు లేడే.. అనుకుంటుండగానే.. నేటి పోస్టర్ లో అదే ఫోజులో ఉన్న నాగార్జున చెంత నాని కూడా దర్శనమివ్వడంతో ఆ లుక్ చూడగానే అభిమానుల్లో నవ్వుల పువ్వులు వెల్లివిరిసాయి.  దేవదాస్ నిర్మాత అశ్వనిదత్ నాగార్జునకు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలిపారు. 

నాగార్జున గారు చేసే ప్రయోగాల రికార్టుల గురించి పుస్తకమే రాయాల్సి ఉంటుందేమో! శివ - హలోబ్రదర్ నుంచి మొన్నటి `మనం` వరకూ అదే ఆయన పంథా. ఇప్పటికీ ప్రయోగాల్ని ఆహ్వానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు` దేవదాస్` ఆ తరహా సినిమానే అని అర్థమవుతోంది. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని ఇప్పటికే పోస్టర్లు - టీజర్లు చెప్పేశాయి. సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ కానుందని యూనిట్ ప్రకటించింది.