దేవరకొడ మళ్లీ చొక్కా విప్పేశాడు!

11:37 - November 14, 2018

Vijay దేవరకొండ...అర్జున్‌ రెడ్డి, గీతా గోవిందంతో అందరి మనసులనూ ఆకట్టుకోని హిట్‌ స్టార్‌ అయ్యారు. అయితే ఇప్పుడు దేవరకొండ చొక్కాలేకుండా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకూ చొక్కా లేకుండా కనిపించిన ఏ హీరోకీ లేని క్రేజ్‌ మన దేవరకొండకు దక్కుతుంది. అవునండీ.. అర్జున్‌ రెడ్డిలోనూ, గీతా గోవిందంలోనూ ఇదే ఫాలో అయ్యాడు. ఇప్పుడు రాబోతున్న టాక్సీవాలాలో కూడా ఇదే కొససాగిస్తున్నాడు.  దేవరకొండ షర్ట్ లేకుండా కనిపిస్తే పిచ్చి క్రేజు కనిపిస్తోంది. అతడు షర్ట్ విప్పేస్తే చాలు గాళ్స్ ఫిదా అయిపోతున్నారు. అందుకే పదే పదే దేరకొండ చొక్కా విప్పి కనిపిస్తున్నాడు.తన సినిమాల ట్రైలర్స్ ని పరిశీలిస్తే ఈ సంగతి ఇట్టే అర్థమైపోతోంది. చొక్కా లేకుండా ఒరిజినాలిటీని బయట పెట్టేస్తున్నాడు. నేచురల్ లుక్ లో కనిపించి కాలేజ్ గాళ్స్ కి కలల రాకుమారుడు అయిపోతున్నాడు. ఆకర్షించాలంటే 6ప్యాక్ లు అవసరం లేదు.. జిమ్ములకు వెళ్లనక్కర్లేదు. మినిమం కసరత్తులు సరిపోతాయి అని దేవరకొండ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. మాంచి జోష్తో కనిపిస్తూ.. సెన్సాఫ్ హ్యూమర్ తో ఆకట్టుకోవడం - వేదికలపై మాట్లాడేప్పుడు బ్రిలియన్సీ చూపించడం ఇవన్నీ దేవరకొండ ఫాలోయింగ్ ని అంతకంతకు పెంచుతున్నాయి.