దూసుకుపోతున్న ' టాక్సీవాలా '

17:13 - November 22, 2018

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  పైరసీ సమస్య.. డిలే కావడంతో సినిమాపై హైప్ తక్కువగా ఉండడం లాంటి కారణాలు ఉన్నప్పటికీ దీంతో సంబంధం లేకుండా సినిమాకు హిట్ టాక్ వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఆరు రోజులు.  ఈ ఆరు రోజుల్లో పాతిక కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేసిన 'టాక్సీవాలా' దాదాపుగా 15 కోట్ల షేర్ సాధించింది.  వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. బుధవారం హాలిడే కావడం కూడా సినిమాకు ప్లస్ అయింది. ఈ వారం కూడా '24 కిస్సెస్' తప్ప వేరే చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి 'టాక్సీవాలా' సెకండ్ వీక్ లో కూడా మంచి కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.  అంటే రజనీకాంత్ '2.0' రిలీజ్ వరకూ దేవరకొండ దారికి అడ్డు లేదు. అమెరికాలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంది. యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 'పెళ్ళిచూపులు' సమయంలో ఈ సినిమా రైట్స్ ను తక్కువ రేట్ కు తీసుకోవడంతో ఫుల్ గా లభాలు వస్తున్నాయని సమాచారం.  ఈ సినిమా ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 25 కోట్ల షేర్ వసూలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.