దీపికా, రన్‌ వీర్‌ల పెళ్లి సందడి మొదలైంది!

13:41 - November 3, 2018

దీపికా పదుకునే, రన్‌ వీర్‌ల పెళ్లి సందడి మొదలైంది. నవంబర్ 14-15 తమ వివాహపు తేదీలు అంటూ రన్ వీర్ స్వయంగా తన ట్విట్టర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైయిపోయాయి. గత రెండేళ్లుగా దీని గురించి ఎన్ని రకాల వార్తలు ఎంత ప్రచారం జరిగినా సైలెంట్ గా ఉంటూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు ఒకటి కాబోతోంది. బెంగుళూరులో దీపికా ఇంట్లో సాంప్రదాయబద్ధంగా జరిగే నంది పూజాతో వేడుకలు శ్రీకారం చుట్టారు. ఇది వివాహ తంతులో చేయాల్సిన మొదటి ఘట్టం. దీపిక పర్సనల్ స్టైలిష్ట్ షాలినా నాదని కాస్ట్యూమ్స్ పని చూస్తుండగా తనతో పాటు  ఇంటీరియర్ డిజైనర్ వినీత చైతన్య ద్వారా ఈ ఫోటోలు బయటికి వచ్చాయి. రన్ వీర్ కుటుంబ నేపథ్యం మహారాష్ట్రకు చెందిన సింధీ కావడంతో ఆ మేరకు ఆ వేడుకలు విడిగా జరగనున్నాయి. ఇక వివాహ వేదిక విషయానికి వస్తే ఇటలిలోని లేక్ కొమోను ఎంచుకున్నారు. దెల్ బాల్బెయానెల్లో అనే ఖరీదైన విల్లాలో ఇదంతా జరగనుంది. దాని చుట్టూ పక్కల స్థలాలు రూములు అన్ని ఈ ఫంక్షన్ కోసం భారీగా ఖర్చు పెట్టి హోల్ సేల్ గా అద్దెకు తీసుకున్నారు. వీళ్ళ ప్రేమ కథ వయసు ఐదేళ్లకు పైమాటే. పరిచయం పదేళ్ల నుంచే ఉన్నప్పటికీ బాగా సన్నిహితంగా మారింది మాత్రం రామ్ లీలా సినిమా నుంచే. డిసెంబర్ 1న రిసెప్షన్ తాలూకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.