' దిల్వాలే దుల్హానియా లేజాయేంగే ' ఫార్ములాని ఫాలో అవుతున్న డార్లింగ్‌

15:31 - October 13, 2018

' దిల్వాలే దుల్హానియా లేజాయేంగే ' (డీడీఎల్జే ) విజయంలో ఆ సినిమాకి ఉపయోగించిన స్విస్ లొకేషన్లే సగం పాత్ర పోషించాయన్నది ఓ విశ్లేషణ. సరిగ్గా అదే ఫార్ములాని ప్రభాస్ - జిల్ రాధాకృష్ణ బృందం ఉపయోగిస్తున్నారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ బృందం ఇటలీ కోమో-లాంబార్డీ అనే అరుదైన ఎగ్జోటిక్ లొకేషన్లలో చిత్రీకరణలో పాల్గొంటోంది. అక్కడ ప్రకృతి అందాలు సినిమా ఆద్యంతం మత్తెక్కించే ఫీల్ని కలిగిస్తాయని చెబుతున్నారు. వీటన్నిటినీ మించి ఈ లవ్స్టోరి ఆద్యంతం యూరప్-ఇటలీలో 1940 కాలంలో సాగుతుంది కాబట్టి అందుకు తగ్గ యాంబియెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. నాటి జనం ఉపయోగించిన ఖరీదైన వింటేజ్ కార్లు పాత కాలం బస్సుల్ని ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో లీకై హల్ చల్ చేస్తున్నాయి. కింగ్ ఖాన్ షారూక్ - కాజోల్ జంటగా యశ్రాజ్ ఫిలింస్ నిర్మించిన `డీడీఎల్జే` నాడు ఎంతటి సంచలనమో తెలిసిందే. ఆ సినిమాని మెజారిటీ పార్ట్ స్విట్జర్లాండ్లోని బ్యూటిఫుల్ నేచుర్ మధ్య తెరకెక్కించారు. షారూక్ - కాజోల్ జంట ఎటర్నల్ లవ్స్టోరిని యూత్ ఓ రేంజులో ప్రేమించి మరీ థియేటర్లలో చూశారంటే ఆ సినిమా యాంబియెన్స్ అంతగా ఆకట్టుకుంది కాబట్టే. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఏళ్లకు ఏళ్లు థియేటర్లో ఆడిన సినిమాగా డీడీఎల్జే సంచలనం సృష్టించింది. `రంగస్థలం` సక్సెస్ తర్వాత పాత కాలంలోకి వెళ్లి అక్కడ కొత్త కథల్ని వెతుక్కోవడం మన దర్శకరచయితలకు అలవాటు వ్యాపకంగా మారింది. ఈ కోవలోనే ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమాకి నాటి కథాంశాన్ని ఎంచుకోవడం విశేషం. 1940బ్యాక్ డ్రాప్కి తగ్గట్టు వేషం భాష అన్నీ మార్చేశారు. మారిన ప్రభాస్ లుక్ ఇప్పటికే వెబ్లో లీకై అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.