దసరా సెలవులకు మాత్రమే పరిమితమైన అరవింద జోరు...!

12:45 - October 24, 2018

ఈ ఏడాది దసరా కానుకగా ఎన్టీఆర్‌ నటించిన  అరవింద సమేత వీరరాఘవ మూవీ కలెక్షన్స్‌ దసరా సెలవుల వరకే పరిమితమయ్యాయి అని చెబుతున్నారు. ఎందుకంటే సెలవలు ఈ ఆదివారంతో అయిపోయాయి. ఆ తరువాత సోమవారం నుండి అరవింద కలెక్షన్స్‌ పడిపోయాయి. మొదటి రోజు కలెక్షన్స్ తో నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్న ఎన్టీఆర్ రెండు వారాల్లో 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టాడు. అయితే ఫ్యాన్స్ మరియు సినీ వర్గాల వారు ఆశించినట్లుగా సెలవుల తర్వాత అరవింద సమేత కలెక్షన్స్ రావడం లేదని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఒక్కసారిగా షేర్ తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిన దక్కించుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 93 కోట్లకు అమ్ముడు పోయిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దక్కించుకోవాలంటే ఇంకా 7 కోట్ల మేరకు వసూళ్లు చేయాలని సమాచారం. ఇప్పటికే అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదని తేలిపోయింది. వచ్చే శని ఆదివారాల్లో ఈ చిత్రం మరోసారి జోరు కొనసాగించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు వారాల వరకు పెద్ద సినిమాలు - క్రేజీ మూవీలు ఏమీ కూడా విడుదలకు లేవు. ఆ కారణంగా అరవింద సమేత చిత్రం సందడి కొనసాగుతుందని అనుకున్నారు. కాని వీకెండ్స్ లో తప్ప వీక్ డేస్ లో మాత్రం ఈ చిత్రం అంతగా జోరు కనబర్చలేక పోతుంది. ఇలాగే కొనసాగితే ఫ్యాన్స్ కోరుకున్న 100 కోట్ల షేర్ క్లబ్ లో ఈ చిత్రం చేరడం అనుమానమే.