దసరా కానుకగా..అక్టోబర్‌ 4న ' నోట ' విడుదల

12:25 - September 7, 2018

 విజయ్ దేవరకొండ నటించిన ' నోట ' దసరా కానుకగా తెలుగు, తమిళంలో అక్టోబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అర్జున్‌ రెడ్డి - గీతా గోవిందం సినిమాలతో టాలీవుడ్ లో విజయ్ స్టార్‌ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు విజయ్ లక్‌ చాలా బాగుంది. ఏది మొదలుపెట్టినా సెక్సెస్సే. 

 పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంకు తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు కూడా తమిళంలో మంచి స్టాండ్ దక్కలేదు.  ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ అక్కడకు వెళ్లడం అందరికి ఆశలు కలిగిస్తుంది. 

‘నోటా’ చిత్రంలో విజయ్ దేవరకొండ సీఎంగా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం తమిళ దళపతి విజయ్ - మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కార్’. ఈ చిత్రంలో కూడా విజయ్ సీఎంగా కనిపించే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. విజయ్ ‘సర్కార్’ చిత్రంను దీపావళి సందర్బంగా విడుదల చేయబోతున్నారు. సర్కార్ కంటే నెల రోజుల ముందు ‘నోటా’ విడుదల కాబోతుండటంతో అక్కడ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగులో కూడా దసరాకు ముందు విడుదల చేయడం వల్ల మంచి వసూళ్లు సాధ్యం అవుతాయనే టాక్ వినిపిస్తుంది.