త్వరలో ' టైటానిక్‌ 2 '

13:12 - October 26, 2018

జేమ్స్‌ క్యామెరూన్‌ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ జంటగా నటించిన  ' టైటానిక్‌  ' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇంతగొప్ప సినిమాకు త్వరలో సీక్వెల్ రానుంది. ' టైటానిక్‌  ' అవడానికి హాలీవుడ్ చిత్రమైన అన్ని చిత్రసీమలకు సుపరిచితమైన సినిమా. క్లాస్, మాస్ తేడా లేకుండా ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ అభిమానించారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయనాయకుడైన క్లైవ్‌ పామర్‌ ఈ సినిమా సీక్వెల్‌ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా క్లైవ్ మాట్లాడుతూ.. ' టైటానిక్‌లో ప్రయాణించాలని లక్షలాది మంది కలలు కన్నారు. ' టైటానిక్ 2 ' తో వారి ఆశలు నెరవేరబోతున్నాయి' అని తెలిపారు.  ' టైటానిక్ ' వచ్చిన వెంటనే సీక్వెల్‌ని తీయాలనుకున్నారట. కానీ అప్పుడు కుదరలేదు. అది ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది