తోటకూర తింటే ఇంత ఆరోగ్యమా?

12:35 - August 16, 2018

తోటకూరలో లెక్కలేనన్ని పోషకాలున్నాయి. తరచూ తోటకూరను తింటే ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గాలనుకునే వాళ్లు ప్రతి రోజూ తోటకూర తినడం మంచిది. దీనిలోని పీచు పదార్ధం జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాదు ఇది కొవ్వును తగ్గిస్తుంది. 
హైపర్‌ టెన్షన్‌తో బాధపడే వాళ్లకు తోటకూర చాల మేలు చేస్తుంది. అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది. దీనిలో వున్న విటమిన్‌ ' సి ' రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకోగలుతుంది.
ఈ కూరలో లభించే కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలు లభిస్తాయి. ఇవి రక్తనాళాల్ని చురుగ్గా ఉంచుతాయి. వీటితోపాటు గుండెకు మేలు చేసే సోడియ, పొటాషియం వంటివి సమకూరుతాయి. 
తోటకూరని విటమిన్‌ల ఖని అని చెప్పవచ్చు. ఎందుకంటే విటమిన్‌ ఎ,సి,డి,ఇ,కె విటమిన్‌ బి12, బి6 అన్ని కూడా ఇందులో వుంటాయి. వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి లభిస్తుంది. దీనిని వేపుడు కన్నా కూర చేసుకొని తింటే అధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.