తెలుగు భాషను మళ్లీ అవమానించిన కేంద్రం..

15:18 - October 31, 2018

తెలుగు వారిపై అడుగడుగునా వివక్ష చూపుతున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలుగు భాషను అవమానించింది. దేశ ఐక్యతకు చిహ్నంగా ప్రపంచమంతా తెలిసేలా ఆవిష్కరించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మహా విగ్ర శిలా ఫలకంలో తెలుగు భాషకు చోటు లేకుండా చేసింది. దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉన్నా.. కావాలనే తెలుగు భాషను బీజేపీ పట్టించుకోలేదంటూ భాషాకోవిదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. '  స్టాట్యూ ఆఫ్ యూనిటీ ' ఐక్యతకు చిహ్నం అయితే అందులో తెలుగు ఎందుకు లేదదని భాషా కోవిదులు ప్రశ్నిస్తున్నారు. శిలా ఫలకంపై పది భాషలకు చోటు కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. దక్షిణాది నుంచి కేవలం తమిళ భాషను మాత్రమే ముద్రించింది. అయితే తమిళంలో తప్పుగా రాశారని దాన్ని కూడా చెరిపేయడం గమనార్హం. దేశ ఐక్యతకు చిహ్నంగా చెబతున్న విగ్రహం శిలా ఫలకంపై దక్షిణాది భాషలకు చోటెందుకు కల్పించలేదని ప్రశ్నిస్తున్నారు. సర్దార్ చెప్పిన ఐక్యత ఇదేనా ? అంటూ నిలదీస్తున్నారు.