తెలంగాణ రాజకీయాల్లోకి స్వాములోరు...

11:58 - October 8, 2018

తెలంగాణ రాజకీయాలు.. ఉత్తర ప్రదేశ్‌ రాజకీయ మోడల్‌ను పాటిస్తుందనిపుస్తుంది. ఎందుకంటారా?...తెలంగాణ రాజకీయాల్లోకి స్వామి పరిపూర్ణనంద రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  తాజాగా పరిపూర్ణనందకు ఢిల్లీ నుంచి కబురొచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయన్ను వెంటనే ఢిల్లీకి రావాలని పిలిచినట్లుగా చెబుతున్నారు. శ్రీ పీఠం అధిపతిగా సుపరిచితుడైన ఆయనకు అమిత్ షా నుంచి పిలుపు రావటం వెనుక రాజకీయ సంచలనం ఒకటి చోటు చేసుకోనుందన్న మాట రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించే వీలు ఉందంటున్నారు.  ఒకవేళ సీఎం అభ్యర్థి కాకున్నా.. బీజేపీలో చేరి..ఎంపీగా పోటీ చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. స్వాములోరి మెడలో కాషాయం కండువ పడటం పక్కా అంటున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో తాను రాజకీయాల్లోకి వచ్చే విషయం.. బీజేపీలో చేరే అంశం తాను పూజించే అమ్మవారికి వదిలేసినట్లుగా ఆయన చెప్పేవారు. ఇక స్వాములోరు తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే...అభివృద్ధిని పక్కన బెట్టి నిత్యం పూజలు, పురష్కారాలతో ప్రజలను ఏం చేస్తారో వేచి చూడాలి.