తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు గాంధీభవన్‌ కాదట!..ఎక్కడో తెలిస్తే!..

13:00 - November 16, 2018

మామూలుగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ  అడ్రస్‌ ఎక్కడ అంటే అంతా గాంధీ భవన్‌ అని చెబుతారు. అయితే ఇప్పుడు అలా చెప్పడానికి వీల్లేకుండా అయింది పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ మారిందట!. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు రాని ఆశావాహులు చెప్పిన ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ అమరావతికి మారిందంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు జతకట్టాయి. పొత్తు కుదర్చడం వరకే తన పని అని - సీట్లు టిక్కెట్లు వంటివి తనకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు చెప్పారు. ఇది విన్నవారంతా నిజమే కాబోలు అని అనుకున్నారు. తన జోక్యం ఉండదూ అంటే ఉంటుందీ అని తెలియని కాంగ్రెస్ నాయకులకు టిక్కెట్ల పంపీణీతో విషయం అర్దంమయ్యింది. కాంగ్రెస్ పార్టీతో కుదిరిన పొత్తు మేరాకు అధికారికంగా 14 స్దానాలు తీసుకున్న అనాధికారికంగా 40 మంది వరకు టిక్కట్లు వచ్చేలా చేసారట చంద్రబాబు. ఆ 40 మంది చంద్రబాబు మనుషులేనని అమరావతిలో తన ఛాంబర్లో కూర్చుని ఖరారరు చేసారని కాంగ్రెస్ ఆశావాహుల ఆరోపణ. చంద్రబాబు ఎంపిక చేసిన అభ్యర్దులకు కాంగ్రెస్ అధిష్టానం బీ-ఫారాలు ఇచ్చిందని ఆశావాహలు అంటున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యలయం అమరావతికి మారిందనడంలో ఆశ్యర్యం - అనుమానం చెందాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు