తెలంగాణ అసెంబ్లీ రద్దుకు అసలు కారణం ఇదట!

16:28 - October 9, 2018

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గడువుకు 9 నెలలు ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలు తెచ్చారు మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌.
అయితే ముందస్తు పెట్టేందుకు కారణం చెప్పాల్సి వుంటుంది. దీనికి కేసీఆర్‌ ప్రతిపక్షాలను బాగా వాడుకున్నారు. ప్రభుత్వంపై అందరూ కేసులు పెడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, అందుకే కోర్టులో కేసు వేసి ముందస్తు ఎన్నికలకు అసెంబ్లీ రద్దు చేయాలని కోరారు. 

ఎవరైనా కష్టం వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటారు. ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వకపోతే ఇక మిగిలింది చట్టం. అందుకే అక్కడకు వెళ్లి కేసు పెట్టారు. అయినా నోరు తెరిస్తే అందరినీ ఏకిపారేసే కేసీఆర్‌..కేవలం ప్రతిపక్షాలు కేసులు పెడుతున్నారనే అసెంబ్లీ రద్దు చేశానని చెబితే...నమ్మడానికి ప్రజలు అంత అజ్ఞానులు కాదని కేసీఆర్‌ గుర్తించాలి.

కేసులు వేయగానే కాళేశ్వరం ప్రాజెక్టు ఆగిందా? మిషన్ భగీరథ నిలిచిపోయిందా? మిషన్ కాకతీయకు బ్రేక్ పడిందా? తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏ పథకమైనా కేసుల వల్ల ఆగాయా అంటే లేదనే సమాధానం ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి వస్తోంది. కోర్టులో కేసు  వేయగానే ప్రభుత్వ లాయర్లు ఉన్నారు కదా!. పిటీషన్లలో పస ఉంటేనే కోర్టు స్వీకరిస్తుంది లేదంటే పిటీషన్ వేసిన వారినే చీవాట్లు పెడుతుంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై ప్రభుత్వం తరపున వాదించే లాయర్లు.. ప్రతిపక్షాలు కోర్టుకు వెళుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని.. కేసులతో పాలన సాగడం లేదని.. అందుకే ప్రతిపక్షాలు - అధికార పక్షం ఎవరిది కరెక్టో తేల్చుదామనే  టీఆర్ ఎస్ అసెంబ్లీ రద్దు చేసినట్టు వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారట..ఇక అసలు విషియానికి వస్తే...అసెంబ్లీ రద్దుపై కేసీఆర్‌ చెప్తున్న ఇవన్నీ ప్రజలను, కోర్టులను మభ్యపెట్టడానికే...ఎందుకంటే అసలు కారణం ఇది. కేసీఆర్‌ జాతకం ప్రకారం 2018లో ఎన్నికలు జరిగితేనే కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని.. ఆయన జాతకం ప్రకారం.. 2019 లో ఎన్నికలు జరిగితే నష్టమేనన్నటు ఉందని సమాచాారం. అందుకే జ్యోతిష్యులు చెప్పిన ప్రకారమే ఆయన తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇదే విషయాన్ని హైకోర్టులో చెబితే చీవాట్లతోపాటు కేసు వీగిపోతుంది. అందుకే ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని వాదన వినిపిస్తున్నారు.