తెలంగాణలో లెక్కతేలిన ఓటర్ల సంఖ్య

15:04 - December 4, 2018

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లోనూ, జనాలలోనూ ఆసక్తి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో డిశంబర్‌ 7న జరగబోయే ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. దీంతో పాటు ఓటర్ల జాబితాను సవరించి ప్రస్తుతం తెలంగాణలో వున్న ఓటర్ల సంఖ్యను తెలియజేసింది. నాంపల్లిలోని ఫ్యాప్సీలో నిర్వహించిన ఓటర్ల అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల అధికారి డాక్టర్‌ రజత్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సవరించిన ఓటర్‌ జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 2.81కోట్లకు చేరిందని రజత్‌ కుమార్‌ తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.