తెలంగాణలోని ఆ నియోజక వర్గాల్లో మాత్రం డబ్బులు నీళ్లలాగా ఖర్చు చేయాలట!

13:09 - November 12, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల వారూ ప్రచారాల్లో మునిగిపోతన్నారు. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అయితే అన్ని నియోజక వర్గాల్లో కూడా డబ్బులు పంచే కార్యక్రమాలు జరుగుతునే వుంటాయి. దాదాపు రూ.4 కోట్లు నుంచి రూ. 5 కోట్లు దాకా ఖర్చు పెడతారు. అయితే ఒక 15 నియోజక వర్గాల్లో మాత్రం డబ్బులను నీళ్లలాగా ఖర్చు పెట్టాల్సి వుంటుందట!.  అన్ని పార్టీల నుంచి ఈ నియోజకవర్గాల్లో  బిగ్ షాట్సే పోటీచేస్తున్నారు. చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు.. ఒక్కో ఓటుకు తెలంగాణ వ్యాప్తంగా సగటున రూ.1000 ఇస్తే.. ఈ 15 నియోజకవర్గాల్లో మాత్రం ఓటుకు రూ.2000 చొప్పున పంచుతారట.. తెలంగాణలోనే అత్యంత భారీ వ్యయం కలిగే సీట్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎల్ బీనగర్ - రాజేంద్రనగర్ - శేర్ లింగంపల్లిలు.. ఈ మూడు నియోజకవర్గాలు తెలంగాణలోనే బహు ఖరీదైనవట..  ఆ తర్వాత వరుసగా చూస్తే షాద్ నగర్ - సిరిసిల్ల - మంచిర్యాల - కోదాడ - కొడంగల్ - మహబూబాబాద్ - హుజూర్ నగర్ - సూర్యపేట. వరంగల్ ఈస్ట్ - వెస్ట్ లు ఖరీదైన నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ లోని కొంత భాగం ఇక్కడి అభ్య్థర్థులకు వాటాగా వెళుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ నియోజకవర్గాల్లో డబ్బు ఏరులై పారుతుందని చెబుతుంటారు. ఈ నియోజక వర్గాల్లోని సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీచేస్తున్నారు. హూజూర్ నగర్  - కోదాడ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ - ఆయన భార్య పద్మావతి పోటీపడుతున్నారు. కోడంగల్ నుంచి రేవంత్ రెడ్డి - సూర్యపేట నుంచి మంత్రి జగదీశ్వర్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు.