తులసి ఆకులతో ఇంత ప్రయోజనమా !...

17:30 - August 29, 2018

ఒత్తిడిని అదుపులో ఉంచడంలో తులసి పాత్ర కీలకం. తులసి ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుంది.ప్రతిరోజు 10-12 తులసి ఆకులను నమలడం వల్ల నరాల పని విధానం, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.  ఇది మంచి యాంటీ స్ట్రెస్‌ ఎజెంట్‌గా పని చేస్తుంది. అలాగే ఒత్తిడిని కలిగించే హార్మోన్లను, కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి తొలగిస్తుంది. 

- తులసి పొడితో బ్రష్‌ చేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అలాగే చిగుళ్ల సమస్యలు కూడా దూరం అవుతాయి. పంటి నొప్పి ఉన్న వాళ్లు ఐదు తులసి ఆకులను ఒక చెంచా మిరియాల పొడిలో కలుపుకొని ప్రభావిత ప్రాంతంలో ఐదు నిమిషాలు రాసుకుంటే త్వరగా ఉపశమనం పొందుతారు.

- గొంతు నొప్పి ఉన్న వారు కొన్ని తాజా తులసి ఆకులను నీటిలో మరిగించాలి. ఆ నీటితో పుక్కిలించి ఉమ్మడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. 

-  తులసి ఆకుల నుంచి తీసిన రసాన్ని ముఖానికి ప్యాక్‌ వేసుకోవడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది. అలాగే తులసి రసాన్ని కురులకు పట్టించినా మంచి ఫలితం ఉంటుంది. సగం కప్పు తులసి ఆకులను మెత్తగా గ్రైండ్‌ చేసి కొబ్బరి నూనెలో కలుపుకొని వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు ఊడిపోకుండా ఉండటంతో పాటు చివర్లు చిట్లిపోకుండా ఉంటాయి. 

- తులసి జలుబు, జ్వరానికి మంచి యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. పరిగడుపున కొన్ని తులసి ఆకులను తినడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ఒక గ్లాసు నీటిలో ఏడు తులసి ఆకులను, యాలకుల పొడిని వేసి బాగా మరిగించిన తర్వాత తాగితే మలేరియా, ఎలర్జీ వంటి సమస్యలు తొలగిపోతాయి.