తమ తప్పును కప్పేస్తూ...ఎదుటివారి తప్పును చూపిస్తున్న కేసీఆర్‌

11:26 - October 4, 2018


ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ ఎండకు ఆ గొడుగు పడతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే...తమ తప్పులన్నింటినీ...దాచిపెట్టి, ఎదుటివారు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపుతున్నారు. అవునండీ... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావుడి కొనసాగుతున్న విషియం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీల పొత్తులు ఏర్పడుతున్నాయి. దీనిలో భాగంగానే కాంగ్రెస్‌ మహాకూటమిని ఏర్పరిచింది. ఈ మహాకూటమిలో తెలుగుదేశం కూడా వుంది. అది.. సరిగ్గా ఈ పాయింట్‌ను పట్టుకొని మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగారు చెలరేగిపోయారు. బుదవారం నిజామాబాద్‌ లో జరిగిన సభలో '' థూ... మీ బతుకులు చెడా '' తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా? అని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
అసలు విషయానికి వద్దాం...ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే తెలంగాణ ద్రోహి అని ఎవరిని అనాలి?... కేసీఆర్‌ని అనాలి. అవును ఇది ముమ్మాటికీ నిజం .
. తెలంగాణ పోరాటంలో ఎంతో మంది విద్యార్థులు వారి ప్రాణాలను కోల్పోయి సాధించుకున్న సొంత రాష్ట్రంలో ఇప్పటికీ కూడా వారికి ఉద్యోగాలు లేక, నిరుద్యోగంతో బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 
. మన రాష్ట్రం, మన కొలువులు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పింది ఎవరు? కేసీఆర్‌...మరి ఇచ్చిండా? లేదు..మరి తెలంగాణ ద్రోహి ఎవరు?
. మన పంటలకు మనమే గిట్టుబాటు ధరలు నిర్ణయించుకుందామని చెప్పింది ఎవరు? కేసీఆర్‌...మరి గిట్టుబాటు ధర కల్పించిండా? లేదు..మరి తెలంగాణ ద్రోహి ఎవరు?

. తెలంగాణలో పండించిన పంటకు గిట్టుబాటు దర లేక, తెచ్చిన అప్పులు తీర్చలేక ఎంతో మంది రైతులు ఈ నాలుగున్నరేండ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు. 
. పేదలకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇస్తానని చెప్పింది ఎవరు? కేసీఆర్‌..మరి ఇచ్చాడా? లేదు..మరి తెలంగాణ ద్రోహి ఎవరు?
. వీటన్నింటికీ ఒకటే సమాధానం అదే కేసీఆర్‌...
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక ఎవరికొరిగిందంటే ఒక్క కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే... ఎందుకంటే..
వారింట్లోనే అందరికీ కొలువులు వచ్చాయి, కేసీఆర్‌ ప్రగతి భవన్‌ కట్టించుకున్నాడు. అంటే ఆయన చేసిన వాగ్దానాలు ఆయన వరికే నెరవేర్చుకున్నారు మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈయన చేసిన తప్పు పనులను కప్పిపుచ్చేందుకే ఇప్పుడు కాంగ్రెస్‌, చంద్రబాబులపై విరుచుకుపడుతూ..ప్రజల ఆలోచనలను మరోకసారి తప్పుదోవ పట్టిస్తున్నారు.