తమిళ్‌ సినిమాలో...సిఎంగా విజయ్ దేవరకొండ

11:19 - September 1, 2018

తమిళ్‌లో విజయ్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండకు భారీ క్రేజ్ ఉంది. ఈ ఇద్దరికీ సినిమాల పరంగా కొంత సారూప్యం ఉంది. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న విజయ్.. ఇళయదళపతితో కలిసి ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ని పోషించబోతున్నాడు. సర్కార్ సినిమాలో విజయ్ దేవరకొండ తమిళనాడు సీఎంగా కనిపించనున్నాడని సమాచారం. 

ఇద్దరికి సంబంధించిన సినిమాలూ విడుదలకు ముందు చాలా వివాదస్పదమయ్యాయి. ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా సర్కార్. ఈ సినిమా కూడా విడుదలకు ముందే వివాదాస్పదమైంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో విజయ్ సిగిరెట్ తాగుతూ కనిపించారు.అంత నేమ్, ఫేమ్ ఉన్న విజయ్ సిగిరెట్ తాగుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడంటూ కొందరు రచ్చ రచ్చ చేశారు. ఇదిలా వుంటే..ఒకే సినిమాలో ఇద్దరు సంచలన స్టార్స్  దుమ్ము రేపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.