తమన్న రూటులోనే కాజల్‌ కూడా...

16:55 - December 4, 2018

సినిమా ఇండస్ట్రీ వారికి మీడియా అంటే చిన్న చూపో లేదంటే మరేంటో కాని ఏ చిన్న కార్యక్రమం అయినా మీడియా సమావేశం అయినా కూడా మీడియా వారిని వెయిట్ చేయిస్తూ ఉంటారు. కొన్ని రోజుల క్రితం తమన్నా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఒక సినిమా ప్రమోషన్ కోసం ఆమె ఇంటర్వ్యూలు తీసుకునేందుకు నిర్మాతలు మీడియాను పిలిచారు. ఆమె వస్తానంటూ చెప్పిన సమయంకు రాకుండా ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. తమన్నా పై కోపం వచ్చినా కూడా మీడియా వారు ఓపిక పట్టి ఆమె వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు చేశారు. అదే రూటులో ఇప్పుడు కాజల్‌ వెల్తుంది. తాజాగా కాజల్ కూడా అదే తప్పు చేసింది. కవచం మూవీ ప్రెస్ మీట్ లో భాగంగా కాజల్ దాదాపు రెండు గంటల ఆలస్యం అయ్యింది. అయితే ఈసారి మీడియా మిత్రులు సహించలేదు. కాజల్‌కు మరియు ఆలస్యంగా వచ్చే వారందరికీ గుర్తుండేలా షాకిచ్చారు. ఎలాగంటే...కాజల్ వచ్చినంత వరకు అక్కడే ఉన్న మీడియా వారు ఆమె రాగానే ఆలస్యంకు కారణంగా ప్రెస్ మీట్ ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించి అక్కడ నుండి వెళ్లి పోయారు. దాంతో షాక్ తిన్న కాజల్ మీడియాకు సారీ చెప్పే ప్రయత్నం చేసింది. కాని మీడియా వారు మాత్రం వినిపించుకోకుండా అక్కడ నుండి వెళ్లి పోయారు. నిర్మాతలు మీడియా వారిని ఒప్పించేందుకు చూశారు. కాని పదే పదే మమ్ముల్ని ఇలా వెయిట్ చేయిస్తే ఊరుకోం అంటూ ఇదో హెచ్చరిక అంటూ మీడియా ప్రతినిధులు వార్నింగ్ ఇచ్చారు. కాజల్ ప్రెస్ మీట్ ను మరో రోజుకు వాయిదా వేశారు.