తమన్నా మరోసారి డార్క్‌గా కనిపిస్తుందట!

15:07 - December 12, 2018

భారతదేశంలో తెలుపు రంగు ఉన్నవారి పై వ్యామోహం ఎక్కువే.. కలర్ అనేది జీన్స్ ద్వారా వస్తుందని తెలిసినా ఎందుకో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.  కానీ కొందరికీ ఈ కలర్ సమస్య అసలు ఉండదు. ఎందుకంటే వాళ్ళు అసరమైన దానికంటే ఎక్కువ ఫెయిర్ గా ఉంటారు. తమన్నా ఈ కేటగిరీలోనే ఉంటుంది. అందుకే ఈ భామకు మిల్కీ బ్యూటీ అనే బిరుదిచ్చారు. కానీ ఈ సుందరికి నలుపు రంగులో కనిపించేందుకు ఏమాత్రం అభ్యంతరం లేదు.  'బాహుబలి: ది బిగినింగ్' లో మేకప్ సాయంతో తమన్నా కాస్త డార్క్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే రెండు సినిమాల్లో కాస్త నలుపు రంగులోనే కనిపిస్తుందట. తమన్నా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా' లో నటిస్తోంది. దీంతో పాటుగా 'దేవి-2' లో కూడా మిల్కీనే హీరోయిన్.  ఈ రెండు సినిమాల్లో తన పాత్ర ప్రకారం డార్క్ గా కనిపించాల్సి వస్తుందట.  దీంతో తనకు కరెక్ట్ గా సూట్ అయ్యే నలుపు షేడ్ కోసం 50 సార్లు లుక్ టెస్ట్ చేసుకొని.. ఫైనల్ గా ఒక షేడ్ కు ఫిక్స్ అయిందట.