తమన్నా అలా ఎందుకు చేసిందో?

11:50 - December 3, 2018

మిల్కీవైట్ బ్యూటీ తమన్నాలో ఊహించని మార్పు ఫిలిం వర్గాల్లో - సినీ జర్నలిస్టుల్లో చర్చకొచ్చింది. ఈ భామ మునుపటితో పోలిస్తే ఇప్పుడు చాలా బోల్డ్ గా కనిపిస్తోంది. పైగా యాటిట్యూడ్ లోనూ బోల్డ్ నెస్ తెలిసిపోతోంది. ఇదేంటి తమన్నా ఏం చేసిందని ఇలా అంటున్నారు అనుకుంటున్నారా? అసలు విషియానికి వస్తే...తమన్నా నటించిన `నెక్ట్స్ ఏంటి?` ఈనెల 7న రిలీజవుతోంది. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ కోసం జర్నలిస్టుల్ని హైదరాబాద్- దసపల్లాకి ఆహ్వానించారు. కానీ అక్కడే అసలు కథంతా మొదలైంది. మిల్కీ కోసం గంట కాదు.. 2 గంటలు కాదు.. ఏకంగా 3 గంటల పాటు సుదీర్ఘంగా వెయిట్ చేశారంతా. జర్నలిస్టుల జీవితాల్లో నెక్ట్స్ ఏంటి? అన్నది అటుంచితే.. ఇంటర్వ్యూ పేరుతో 150 మంది సినీజర్నలిస్టులు దసపల్లాలో అదే పనిగా గంటల కొద్దీ పడిగాపులు పడ్డారు. అంత ఆలస్యంగా వచ్చిన తరువాత కూడా... అరే.. నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేరా? అన్నట్టే ఈ అమ్మడి వ్యవహారం కనిపించడంతో అందరిలో చిటపటలు మొదలయ్యాయి. ముందు ఎదురుచూస్తున్న జర్నలిస్టులు ఇలా అనుకున్నారు. ఇంతకీ రాదు.. ఎంతకీ రాదు.. అయ్యో పాపం! ఒకవేళ చెన్నయ్ నుంచి విమానంలో వస్తుందేమో అందుకే ఆలస్యమైందంటూ ఓపిగ్గా వేచి చూసిన జర్నలిస్టులకు చివరిలో ఓ ట్విస్టు. ఈ అమ్మడు స్టే చేసిన బస హైదరాబాద్- పార్క్ హయత్ లో ఉంది. అక్కడ ఆల్రెడీ అరైవ్ డ్. విశ్రాంతి తీసుకుంటోందట. అది తెలిసాక మాత్రం లోకల్ గా ఉండి ఇంతగా చుక్కలు చూపిస్తుందనుకోలేదు అంటూ మా మంచి జర్నలిస్టులు లోలోన తెగ మదనపడిపోయారు. పార్క్ హయత్ హోటల్ నుంచి దసపల్లా హోటల్ మధ్య కేవలం కిలోమీటర్ మాత్రమే దూరం. ఆ దూరం చేరడానికి అంత కలరింగ్ ఇచ్చింది మిల్కీ.  మొత్తానికి మిల్కీ నటించే నెక్ట్స్ ఏంటి? అన్నదానిపై క్లారిటీ లేకపోయినా ప్రస్తుతంలో మాత్రం అలా ఆడుకుంటోందన్నది క్లోజ్ సోర్స్ చెబుతున్న మాట.