తమన్నాకు నిల్‌...కాజల్‌కు ఫుల్‌..

12:54 - December 23, 2018

ఏ సినిమానైనా రీమేక్ చేసే సమయంలో ఒరిజినల్ తో పోలికలు తప్పవు. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన 'క్వీన్' సినిమాను నాలుగు సౌత్ ఇండియన్ భాషలలో రీమేక్ చేస్తున్నారనే విషయం తెలిసిందే.  హిందీ సినిమాలో కంగన తన నటనకు గానూ నేషనల్ అవార్డు సాధించింది. తమిళంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా తెలుగులో తమన్నా కంగనా పాత్రను పోషిస్తోంది.  తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్' పేరుతోనూ.. తెలుగులో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' పేరుతోనూ ఈ రీమేకులను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ రెండు సినిమాల టీజర్లు రిలీజ్ అయ్యాయి. తెలుగు వెర్షన్ టీజర్ చప్పగా సాగితే తమిళ వెర్షన్ టీజర్ మాత్రం లైవ్లీ గా.. స్పైసీగా సాగింది.  రాజమండ్రి అమ్మాయిగా  గోదావరి యాసలో మాట్లాడడం ఎందుకో తమన్నాకు సూట్ కాలేదు.  తెలుగు వెర్షన్ టీజర్ కు నెటిజనుల రెస్పాన్స్ కూడా నెగెటివ్ గా ఉంది. తమిళ వెర్షన్ తో పోలిస్తే క్వాలిటీ కూడా తక్కువగా ఉందని కామెంట్ చేస్తున్నారు. అదే 'ప్యారిస్ ప్యారిస్' విషయానికి వస్తే కాజల్ విలేజ్ యాసలో మాట్లాడకుండా నార్మల్ గా మాట్లాడినప్పటికీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా ఫ్రెండ్ పాత్ర పోషించిన ఎల్లి అవ్రామ్ కాజల్ బ్రెస్ట్ ను చిలిపిగా ప్రెస్ చేయడం అనేది పెద్ద కాంట్రవర్సీ అయింది గానీ సేమ్ క్లిప్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. ఒక్క బోల్డ్ సీన్ తో సినిమాకు బోల్డంత పబ్లిసిటీ వచ్చేసింది. ఓవరాల్ గా తెలుగు వెర్షన్ తుస్సుమనిపిస్తే తమిళ వెర్షన్ శభాష్ అనిపించింది.