తన యాటిట్యూడ్‌తో మరోసారి వార్తల్లో నిలిచిన సాయిపల్లవి

15:46 - December 19, 2018

'ఫిదా'లో భానుమతి పాత్ర తో హైబ్రిడ్ పిల్లగా తెలుగు ప్రేక్షకులందరినీ ఫిదా చేసినా సాయి పల్లవి రూటే సెపరేటు.  మిగతా హీరోయిన్ల కు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. నటన.. డ్యాన్స్ లలో దుమ్ము లేపే సాయిపల్లవి తన యాటిట్యూడ్ తో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి వార్తల్లోకెక్కింది. శర్వానంద్ హీరో గా నటిస్తున్న 'పడి పడి లేచే మనసు' సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ప్రోమోలలో శర్వా - సాయిపల్లవి ల మధ్య ఉండే కెమిస్ట్రీ బాగుందనే ప్రశంసలు అందుకున్నారు.  ఇదిలా ఉంటే.. సాయి పల్లవి హీరో శర్వాను సినిమాలో రొమాన్స్ చేసినా సెట్స్ లో మాత్రం 'అన్నా' అనే పిలిచేదట.  సాయి పల్లవి ఏ సినిమా చేసినా తన కు క్లోజ్ గా ఉండే వారిని ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తుందట. అందుకే ఏదో ఒక రిలేషన్  తో  పిలుస్తుందట. ఇక్కడ శర్వా 'అన్న' అయ్యాడు. గతంలో కూడా 'ఫిదా' సినిమాలో తండ్రి పాత్ర పోషించిన సాయి చాంద్ ను నిజంగా నే నాన్నలాగా ట్రీట్ చేస్తూ 'నాన్న' అనే పిలుస్తానని చెప్పిన విషయం తెలిసిందే.