తను హీరో...అయినా మొబైల్‌ ఫోన్‌ లేదు

14:33 - September 25, 2018

మొబైల్‌ ఫోన్‌...ఇప్పుడు ఇది లేకుండా వుండేవాళ్లు చాలా చాలా తక్కువ మంది అనుకుంట. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ అందరికీ కామన్‌ వస్తువు మొబైల్‌ ఫోన్‌. ఇక సినీ ఇండిస్టీలో వుండేవారికి మొబైల్‌ ఖచ్చితంగా వుండి తీరాలి. కానీ ఒక హీరో మాత్రం ఇందుకు భిన్నంగా...ఇప్పటి వరకై మొభైల్‌ ఫోన్‌ వాడకుండా వున్నారు. ఎవరా...ఆ హీరో అనుకుంటునానరా...అదేనండీ నాగ శౌర్య. అవును మీరిన్నది నిజమే నాగ శౌర్యకు ఇప్పటి వరకూ మొభైల్‌ ఫోన్‌ వాడే అలవాటు లేదు. కారణాలు ఇప్పుడు అప్రస్తుతం కానీ ఫైనల్ గా మనోడు ఈ బ్యాచ్ లోకి ఎంటరై పోయాడు. సాధారణంగా సెలెబ్రిటీలు ఐ ఫోన్లు వాడతారు. కానీ శౌర్య మాత్రం దానికి భిన్నంగా ఇటీవలే శాంసంగ్ విడుదల చేసిన అత్యాధునిక  గాలక్సీ నోట్ 9 తీసుకున్నాడు. దాని తాలూకు పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న శౌర్య ఇన్నేళ్ల తర్వాత నా చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చింది నేనో ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నానా అంటూ ఓ ఆసక్తికరమైన మెసేజ్ కూడా పోస్ట్ చేసాడు. ఇటీవలే @నర్తనశాల ఫలితంతో నిరాశ చెందినా ఓ కొత్త ప్రయత్నం చేశానన్న తృప్తిలో ఉన్న నాగ శౌర్య ఇకపై కూడా ప్రయోగాలు ఆపను అంటున్నాడు. రాజు కొలుసు దర్శకత్వంలో చేస్తున్న మూవీకి నారి నారి నడుమ మురారి టైటిల్ పరిశీలనలో ఉంది. రమణ తేజతో ఓ సినిమా కమిట్ అయ్యాడు శౌర్య. గణ అనే పేరు ఫిక్స్ చేసే ఆలోచనలో ఉంది యూనిట్. వేరే ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి . ఛలో సూపర్ హిట్ తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్న శౌర్య ఇకపై ఇంకా అలెర్ట్ గా ఉండాలని ఛలో తర్వాత వచ్చిన మూడు సినిమాల ఫలితాలు హెచ్చరించాయి.