తనపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి

14:54 - December 23, 2018

గత కొంతకాలంగా `ఫిదా` బ్యూటీ సాయి పల్లవి గురించి కాంట్రవర్శీ క్వీన్ అంటూ ప్రచారం సాగుతోంది. సెట్ లో హీరోలతో - నిర్మాతలతో గొడవ పెట్టుకుంటుందని - అందరినీ డామినేట్ చేసేస్తుందని ఓ రూమర్ ప్రచారంలో ఉంది. `కణం` టైమ్ లో నాగశౌర్యతో గొడవపడడంతో ఆ రూమర్లు అంతకంతకు హద్దుమీరుతూనే ఉన్నాయి. శర్వానంద్ తోనూ `పడి పడి లేచే మనసు` సెట్ లో గొడవపడిందని ఆన్ సెట్స్ ఉండగా ఓ రూమర్ షికార్ చేసింది. అయితే సాయిపల్లవి వీటన్నిపై మాట్లాడి క్లారిటీ ఇచ్చింది. ``నేను ఎవరినీ డామినేట్ చేయను. డామినేట్ చేస్తానని ఎవరు చెబుతున్నారో తెలియడం లేదు`` అంటూ వ్యాఖ్యానించింది ఈ మలబారు బ్యూటీ. శర్వానంద్ పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. నేను సీనియర్ - హీరోయిన్ జూనియర్.. మొన్ననే వచ్చింది కదా.. అనే ఫీలింగ్ తనకు లేదు. నాకు ఎంతో సౌకర్యం అనిపించింది తనతో. ఆన్ సెట్స్ మంచి స్నేహితులమయ్యాం. ఇద్దరికీ ఈగోలు లేవు. మేం ఎక్కడా ఇబ్బంది పడలేదు... అంటూ క్లారిటీ ఇచ్చింది. శర్వానంద్‌ కూడా `పడి పడి లేచే మనసు`  సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఇదే చెప్పాడు.  సాయి పల్లవిని నేను - నన్ను సాయి పల్లవి డామినేట్ చేస్కుంటే - కెమిస్ట్రీ పండుతుందా? అంటూ ప్రశ్నించాడు శర్వా. తమ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుటైందంటే - అంత బాగా తనతో స్నేహం కుదిరిందని - తన సహకారం వల్లనే ఇదంతా వర్కవుటైందని శర్వా చెప్పుకొచ్చాడు. సాయిపల్లవి ఈ చిత్రంలో ఓ మెడికో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. నటన అన్నది నేర్చుకోకుండా వచ్చి ఈ ఇండస్ట్రీ లో సెటిలయ్యానన్న  కఠోర నిజాన్ని సాయి పల్లవి మరోసారి గుర్తు చేసింది. నా అనుభవాలే నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. అలాంటి అనుభవాలను మరచిపోను. మరచిపోతానేమో అనే భయంగా ఉంటానని చెప్పింది. సాయిపల్లవి జీవితంలో కఠోర నిజాలు ఏం ఉన్నా.. తను మాత్రం స్టార్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన తీరు హర్షణీయం.