తనపై వచ్చిన కామెంట్స్‌కు..ఒక రేంజ్‌లో కౌంటరిచ్చిన నిత్యా...

10:31 - September 10, 2018

నిత్యామీనన్‌ ముక్కుసూటి మనిషి. ఆమె మనసులో ఎటువంటి దాపరికం లేకుండా లోపల ఏదనుకుంటే అదే బయటకు వెంటనే అనేస్తుంది. అయితే అలా చెప్పేటప్పుడు ఎదుటివారు ఎంత గొప్పవారైనా ఆమె అలాగే చెప్తుంది. ఆమె వ్యక్తిత్వాన్ని చంపుకోదు. ఇలాంటి యాట్యూట్యూడ్ వల్ల టాలీవుడ్ లో కొన్ని అవకాశాలను కూడా కోల్పోయిన మాట వాస్తవం. అయితే ఇటీవలే `గీతగోవిందం` లో కథను నేరేట్ చేసే పాత్రలో కనిపించింది. తెరపై చూస్తున్నంతసేపూ నిత్య మరీ లావైందని.. ఇంత పొట్టిగా ఉందేమిటో అన్న గుసగుసలు వినిపించాయి. ఇవే ప్రశ్నించిన ఓ పాత్రికేయుడిని నిత్యా ఓ రేంజులో ఆడుకుంది. ``పొట్టిగా - బోద్దుగా ఉన్నానని నేనేమీ ఫీల్ కాను. ఆత్మ విశ్వాసం గల అమ్మాయిని. నేనేంటో... నా లైఫ్ ఏంటో క్లారిటీగానే ఉంది. నన్ను విమర్శించిన వాళ్లను చూస్తే నవ్వొస్తోంది. ఏ పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారు. పనున్న వారెవరూ పనిగట్టుకుని ఎదుటి వారి జీవితాల్లోకి తొంగి చూడరు.. అంటూ తనదైన శైలిలో అటకాయించింది.