తనకు ఆస్తమా ఉందంటున్న ప్రియాంకా

16:56 - September 19, 2018

ఇంటర్నేషనల్  స్టార్ హీరోయిన్  ప్రియాంక చోప్రా తనకు అస్తమా ఉందని రీసెంట్ గా తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధి అయిన ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నవారికి టాబ్లెట్స్ కంటే ఇన్ హేలర్ వాడడం మంచిదని తెలుపుతూ 'ది బ్రీథ్ ఫ్రీ' అనే కాంపెయిన్ జరుగుతోంది.  అస్తమా తో ఇబ్బందిపడే వాళ్ళకు ధైర్యాన్నిస్తూ వారు అందరిలాగా తమ పనులు చేసుకోవచ్చని అందుకోసం ఇన్ హేలర్ లు వాడాలని ప్రచారం చేస్తున్నారు.  ఈ కాంపెయిన్ కు ప్రియాంక తన మద్దతు ప్రకటించింది.  ట్విట్టర్ ద్వారా "నాకు సన్నిహితంగా ఉండేవారందరికీ నేను ఆస్తమా పేషెంట్ అని తెలుసు.  అందులో దాచేందుకు ఏముంది? అస్తమా నన్ను కంట్రోల్ చేసే లోపు నేను దాన్ని కంట్రోల్ చెయ్యాలనే విషయం నాకు తెలుసు..  నా దగ్గర ఇన్ హేలర్ ఉన్నంతవరకూ నా గోల్స్ సాధించడంలో నాకు నచ్చిన విధంగా జీవించడంలో ఆస్తమానన్ను అసలు ఆపలేదు" అని ట్వీట్ చేసింది.