ఢిల్లీలో అసలేం జరుగుతోంది?..పోలీసులపై సీఎం సీరియస్‌

12:20 - November 16, 2018

ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ '' ఢిల్లీలో అసలేం జరుగుతోంది? '' అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. అదేంటి అలా అడుగుతున్నారు అనుకుంటున్నారా? అసలు విషియానికి వద్దాం...ఆమాద్మీ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ ఇంటిపై 25 మంది దుండగులు కాల్పులకు తెగబడడం జరిగింది. ఈ ఘటనపై సౌత్ ఢిల్లీలోని సంగమ్ విహార్ కౌన్సిలర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ''  దాడి జరిగిన సమయంలో నా పెళ్లికి వచ్చిన బంధువులతో పాటు నేను ఇంట్లోనే ఉన్నారు. గురువారం సాయంత్రం 6.30 సమయంలో దాదాపు 25 మంది మా ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. వెంటనే మేమంతా ఎవరి గదుల్లో వారు ఉండిపోయి లాక్ చేసుకున్నాం. పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ దాదాపు అరగంట తర్వాత వచ్చారు. అప్పటికే దుండగులు పారిపోయారు..''  అని పేర్కొన్నారు. తన ఇంటి బయట ఓ కారుతో పాటు మూడు బైక్‌లను కూడా దుండగులు తగులబెట్టారని తెలిపారు. రాజకీయ కుట్రతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపిస్తుండగా పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. కొందరు స్థానికులు, కౌన్సిలర్‌కు గొడవ జరిగినట్టు తెలుస్తోందనీ.. త్వరలోనే నిందితులను పట్టుకుని విచార జరుపుతామన్నారు. అయితే పోలీసుల కథనాలను కుమార్ కొట్టిపారేశారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్షసాధింపేనని ఆమాద్మీ పార్టీ ఆరోపించింది. కాగా ఈ ఘటన తాలూకు వివరాలను షేర్ చేసుకుంటూ సీఎం కేజ్రీవాల్ ట్విటర్లో పోలీసులపై మండిపడ్డారు.