టైమ్‌ చెప్పేస్తుంది

13:12 - August 23, 2018

చాలా మందికి ట్రావెలింగ్‌ చేయడం మహా సరదా. గంటల్లో ఫ్లయిట్‌ ఎక్కేసి వేరే దేశానికి వెళిపోతూ ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటారు.ఇలాంటప్పుడే టైమ్‌ జోన్‌లో తేడా వస్తుంది. ఏ దేశంలో ఏ సమయమో సరిగ్గా తెలీదు. అందుకే, ఇలాంటి సమయంలో మీ ఫోన్‌లో సెర్కా యాప్‌ ఉండాల్సిందే. దీన్ని ‘కార్బెన్‌-12’ అనే ఆస్ట్రియా దేశానికి చెందిన డిజైన్‌ ఏజెన్సీ రూపొందించింది. ముందునుంచీ  ఆ కంపెనీకి ఈ యాప్‌ డిజైన్‌ చేయాలన్న ఆలోచన  లేదు. ఒకసారి భారత్‌, ఉక్రెయిన్‌, సింగపూర్‌లోని తన ప్రతినిదులతో మాట్లాడాలని అనుకొంది. అయితే ఈ దేశాలవి వేర్వేరు సమయాలు. దాంతో ఈ యాప్‌ డిజైన్‌ చేసింది.  దీని లుక్‌ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓ పెద్ద వలయం ఆకారంలో టైమ్‌ జోన్స్‌ ఉంటాయి. ఆ సర్కిల్‌కు బయట ఉన్నది ప్రస్తుతం మీరున్న టైమ్‌ జోన్‌. లోపల ప్రపంచ దేశాలకు సంబంధించిన సమయాలు ఉంటాయి. మీకు కావాల్సిన కంట్రీ ఐకాన్‌ మీద క్లిక్‌ చేస్తే సరిపోతుంది. ఇది కేవలం ఐఫోన్‌ వెర్షన్‌లోనే అందుబాటులో ఉంది.