టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే ఆ విమానం...

10:24 - October 29, 2018

ఇండోనేషియాలో జకార్తా నుంచి టేకాఫ్ అయిన 13నిమిషాలకే విమానం కనిపించకుండా పోయింది. ఇందులో మొత్తం 188మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 13నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్నారు. లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం పంగకల్‌ పిన్నాంగ్‌‌కు వెళ్లాల్సి ఉంది. దీంతో అందులో ప్రయాణించే ప్రయాణికులు, సిబ్బంది మరణించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జావా సముద్రంలో ప్రయాణికుల వస్తువులు, జెట్ విడిభాగాలు కనిపించడంతో విమానం కూలిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దాంతో విమాన శిథిలాల కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి.