టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాలకే సముద్రంలో కలిసిపోయారు

10:14 - October 30, 2018

టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే ఆ విమానం సముద్రంలో కూలిపోయింది. అందులో వున్న 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఆరుగురు సిబ్బంది...మొత్తం 189 మంది ఒకేసారి కన్నుమూశారు. వివరాల్లోకి వెలితే...అది ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకార్నో హట్టా అంతర్జాతీయ విమానాశ్ర యం.. స్థానిక కాలమానంప్రకారం ఉదయం 6 గంటలు.. లయన్‌ ఎయిర్‌(జేడీ 610కు చెందిన విమానంలో181 మంది ప్రయాణికులు,ఇద్దరు పైలట్లు,ఆరుగురు సిబ్బంది ఎక్కారు..పంకల్‌ పినాంగ్‌ నగరానికి వెళ్లేందుకు 6:20 కి టేకాఫ్‌ అయ్యింది.. 7:20 కి గమ్యస్థానం చేరుకోవాల్సి ఉంది.. కానీ, టేకాఫ్‌ అయున 13 నిమిషాల్లోనే  విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సంబంధాలు తెగిపోయాయి. మరుక్షణమే జావా సముద్రంలో కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 189 మంది దుర్మరణం పాలయ్యారు. విమానంతో సంబంధాలు తెగిపోగానే అప్రమత్తమైన అధికారులు విమానం కోసం గాలింపు చేపట్టారు. హుటాహుటిన సముద్రంలోకి వెళ్లిన రెస్క్యూ సిబ్బందికి విమాన శకలాలు, ప్రయాణికుల వస్తువులు కనిపించాయి.  విమానాశ్రయంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. సముద్ర ఉపరితలం చమురుతో నిండిపోయింది. బ్లాక్‌ బాక్స్‌ కోసం వెతుకుతున్నామని, అది దొరికితేనే విమాన ప్రమాదానికి కారణాలు చెప్పగలమని ఓ నేవీ అధికారి చెప్పారు.