టెక్నికల్‌గా పాస్‌ కానీ...కలెక్షన్‌ల పరంగా ఫెయిల్‌

11:06 - September 11, 2018

మూడు సినిమాలతో పోటీపడుతూ ' మను ' థ్రిల్లర్‌ సినిమాగా ఇటీవల కాలంలో రిలీజైనది. అయితే ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. టెక్నికల్ గా ఈ సినిమాని గొప్పగా తీశామంటూ రాజా గౌతమ్ & టీమ్ పదే పదే చెప్పేసరికి ఈ సినిమాలో ఏదో సంథింగ్ ఉందనే భావించారంతా. కానీ రిజల్ట్ ఏదైనా డిసైడ్ చేస్తుందిక్కడ. మను టెక్నికల్గా బావున్నా ఎందుకనో వసూళ్లలో ఫెయిలైంది. రాజా గౌతమ్ బాగా నటించాడు. కానీ ఏం లాభం సరైన ప్రమోషన్ లేకపోతే నెగ్గుకొచ్చే రోజులు కావన్న విమర్శ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ పరంగానూ వీక్ కావడంతో ఆ మేరకు అది కలెక్షన్లపై ప్రభావం చూపించిందని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్.  ఇకపోతే బసంతి లాంటి చక్కని చిత్రంలో నటించినా రాజా బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాడు. కనీసం ఈసారైనా `మను`తో హిట్ కొడతానని మీడియాకి ధీమాగా చెప్పాడు. కానీ కెరీర్ లో మరో ఫ్లాప్ డిక్లేర్ అయ్యింది. ఇటీవల యువహీరోల్ని ఓవర్సీస్ ఆదుకుంటున్న వేళ అమెరికాలో మను చిత్రాన్ని భారీగా రిలీజ్ చేశారు. కానీ `మను` చిత్రానికి ఓవర్సీస్ బాలేదన్న రిపోర్ట్ వచ్చింది.