టీచర్లుగా మారిన యాక్టర్లు

10:47 - September 5, 2018

చాలామంది నేను యాక్టర్‌ని కాబోయి డాక్టర్‌ని అయ్యాను లేదా డాక్టర్‌ని కాబోయి యాక్టర్‌ని అయ్యాను అంటుంటారు. కానీ ఇప్పుడు కొత్తగా యాక్టర్లు టీచర్ల అవతారం ఎత్తుతున్నారు.

సర్కారు స్కూళ్లలోని విద్యార్థుల్లో ఆంగ్ల పరిజ్ఞానం పెంపొందిచడమే లక్ష్యంగా ' టీచ్‌ ఫర్‌ చేంజ్‌ ' అనే సంస్థ పనిచేస్తుంది. ఇది 2014 లో ఏర్పాటైంది. ఈ సంస్థ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 200 ప్రభుత్వం పాఠశాలలని ఇప్పటికే దత్తత తీసుకుంది. వీటిలో 600 మంది వాలంట్రీలు వారానికి ఒకసారి ఈ స్కూళ్లకు వెళ్లి అక్కడి విద్యార్థులకు ఇంగ్లీషులో రాయడం, చదవడం నేర్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థను ప్రోత్సహించేందుకు కొంత మంది సినీ తారలు ముందుకొచ్చారు. వారిలో రాణా దగ్గుపాటి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రెజీనా, ప్రణీత, అల్లూ శిరీష్‌ తదితరులు ఈ సంస్థకు చేయూతనిస్తున్నారు.