టీఆర్‌ఎస్‌ నాయకుల తాట వలుస్తాం...!

09:58 - October 5, 2018

ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకుల తాట వలుస్తామని తాజా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ కో-చైర్‌పర్సన్‌ డీకే అరుణ హెచ్చరించారు. గురువారం గద్వాల బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేని అరాచకాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో నాలుగు రోజులుగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఆగ్రహం వెళ్లగక్కిన ఆమె రాజకీయ ముసుగులో రౌడీల్లా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ ' ఖబడ్దార్‌ నా కొడకల్లారా '  అని విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ముందస్తు ఎన్నికల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్దమయ్యారని ఆమె విమర్శించారు. మోదీతో కేసీఆర్‌ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే ముందస్తు ఎన్నికలు వచ్చాయని, ఈ ఎన్నికలు కేసీఆర్‌ కొంప ముంచడం ఖాయమని అన్నారు. ఐదేళ్ల పాలన కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన చేతకానితనంతో అభాసుపాలు చేసిన కేసీఆర్‌కు తిరిగి ఓటు అడిగే హక్కులేదన్నారు.