టీఆర్‌ఎస్‌కు మరో షాక్‌...

12:27 - October 3, 2018

టీఆర్‌ఎస్‌పై ఆ పార్టీ కార్యకర్తలకు రోజు రోజుకూ అసంతృప్తి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నుంచి రాజీనామా పరంపర కొనసాగుతుంది. తాజాగా మంత్రి అనుచరుడు ఒకరు రాజీనామా చేశారు. అయితే ఇయన టీడీపీ నుంచి సర్పంచ్‌గా గెలిచి, తుమ్మలతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరారు. సర్పంచ్‌గా పనిచేసేటప్పుడు సొంత పార్టీ వారే ఆయనపై ఫిర్యాదులు చేసి ఇబ్బందులకు గురిచేశారని, వీటిని తుమ్మల కూడా పట్టించుకోలేదని...ఈ నేపథ్యంలోనే తన అనుచరులతో చర్చించి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన లక్ష్మణ్‌ నాయక్‌, తన అనుచరులు త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం.