టార్చర్‌ ఆపకపోతే సూసైడ్‌ చేసుకుంటా: జబర్దస్త్‌ అవినాస్‌

11:24 - November 28, 2018

ఎన్ని హిట్‌ సినిమాలు వచ్చినా, యాక్షన్‌ సినిమాలు, సీరియల్స్‌ వచ్నినా మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఒకదానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదేనండీ ' హాస్యం '. ఇలా హాస్యన్ని పంచేందుకు ఈటీవీలో ప్రసారమయ్యే ' జబర్దస్త్‌ ' ప్రోగ్రాంను ప్రేక్షకులు జబర్దస్త్‌గా రిసీవ్‌ చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఇందులో టీమ్‌ లీడర్‌గా వున్న ముక్కు అవినాస్‌కు ఒక సమస్య వచ్చింది. దాంతో తాను బాగా టార్చర్‌ అనుభవిస్తున్నానని, అసలు ఆ టార్చర్‌ని తట్టుకోలేకపోతున్నానని, ఆపకపోతే సూసైడ్‌ చేసుకుంటానని ఆయన ఆవేదన వ్యక్త చేస్తున్నారు. అసలు విషియంలోకి వెళ్తే...అవినాష్ ఈ మధ్య చేసిన ఒక స్కిట్ వివాద స్పదమైంది. ఆయన చేసిన ఆ స్కిట్ పై జగిత్యాల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. జరిగిన పొరపాటుకు ఆయన అప్పుడే సారీ కూడా చెప్పేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. "నేను చేసిన పొరపాటుకు వెంటనే క్షమాపణ చెప్పాను. అయినా వినిపించుకోకుండా సోషల్ మీడియాలో నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నన్నే కాకుండా మా అమ్మను .. వదినను కూడా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. ఈ టార్చర్ ను నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ భయ్యా మీరు ఈ టార్చర్ ఆపకపోతే నేను సూసైడ్ చేసుకోవలసి వస్తుంది" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.