టాప్‌10 ఇండియన్‌ సినిమాల్లో..రెండు తెలుగు సినిమాలు

13:40 - December 13, 2018

ఇంటర్నెట్ లో యాక్టివ్ ఆ ఉండే సినీ ప్రియులకు పరిచయం అక్కరలేని పేరు IMDb(ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్).  తాజాగా ఐఎండీబీ వారు 2018 సంవత్సరానికి గానూ టాప్-10 ఇండియన్ సినిమాల లిస్టు విడుదల చేశారు. ఈ లిస్టులో రెండు తెలుగు సినిమాలు చోటు దక్కించుకోవడం విశేషం. అందులో ఒకటి లెజెండరీ తెలుగు యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ 'మహానటి' కాగా మరొకటి రామ్ చరణ్ సినిమా 'రంగస్థలం'.  ఈ లిస్టులో 'మహానటి' నాలుగవ స్థానం సాధించగా.. 'రంగస్థలం' ఏడవ స్థానంలో నిలిచింది.  సహజంగా ఈ లిస్టులో ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలు ఉంటాయి. అలాంటి లిస్టులో రెండు తెలుగు సినిమాలు చోటు సంపాదించడం గొప్పవిషయమే. 

టాప్‌10 లిస్ట్‌: 

1. అంధా ధున్ (హిందీ)
2. రాట్చసన్ (తమిళం)
3. 96 (తమిళం)
4. మహానటి
5. బధాయి హో (హిందీ)
6. ప్యాడ్ మ్యాన్ (హిందీ)
7. రంగస్థలం
8. స్త్రీ (హిందీ)
9. రాజి (హిందీ)
10. సంజు (హిందీ) 
ఈ రెండు తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించడమే కాకుండా  విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న విషయం తెలిసిందే.