టాప్‌ 8లో ' గీతా గోవిందం '

14:09 - September 15, 2018

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ కలెక్షన్లను వసూలు చేసిన  రొమాంటిక్ ఎంటర్‌టైనర్  ' గీతా గోవిందం '. ..ఓవర్సీస్ లోనూ దుమ్మురేపుతోంది. విడుదలై నాలుగు వారాలు పూర్తవుతోన్నా.. ఇంకా ఈ చిత్రం అమెరికాలో వసూళ్ల పరంపర కొనసాగిస్తూనే ఉంది.

గత వారం 2 మిలియన్ మార్క్ సాధించిన  ' గీతా గోవిందం ' చిత్రం.. అమెరికా టాప్-10  టాలీవుడ్ చిత్రాల్లో చోటు దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్‌లో 2.447  మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్-9 లో ఉన్న ' ఫిదా 'ను టాప్-10కు, టాప్-8 లో ఉన్న  ' ఖైదీ నంబర్ 150 ' ని టాప్-9కి పంపంచి.. ప్రస్తుతానికి టాప్-8 లో సెటిలయ్యింది. ' గీతా గోవిందం ' కలెక్షన్లు ఇలాగే కొనసాగితే.. త్వరలో ఓవర్సీస్‌లో  ' అ..ఆ ' ,  ' మహానటి ' కలెక్షన్లను కూడా ఈజీగా దాటేసి.. ఏకంగా టాప్-6కు ఎగబాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.