' టాక్సీవాలా ' చూస్తే బంపర్‌ ఆఫరట!

17:18 - November 19, 2018

విజయ్  దేవరకొండ నటించిన ' టాక్సీవాలా ' విడుదలకు ముందే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. సినిమా పైరసీ చేసి విడుదలకు ముందే చూడడం జరిగింది. అయినా చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ వల్ల చివరకు ' టాక్సీవాలా ' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దక్కించుకుంది. ఇకపై వచ్చేవన్నీ నిర్మాతలకు లాభాలే. దాంతో విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ట్యాక్సీవాలా సినిమా సక్సెస్ వేడుక సందర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మళ్లీ మిమ్మల్ని థియేటర్ లో కలిసేందుకు చాలా సమయం పట్టనుంది. తదుపరి చిత్రం విడుదలకు చాలా సమయం ఉంది. అందుకే ఇప్పుడే ఫుల్ ఎంజాయ్ చేయండి. మరోసారి గట్టిగా కొట్టాం. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకే మీరు కూడా హ్యాపీగా ఉండాలని ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ మా తరపున ఇస్తున్నాం. ఇంటర్వెల్ లో స్నాక్స్ ఎంత కావాలంటే అంత ఎన్ని కావాలంటే అన్ని తినేయండి. బిల్లు మేం కడతాం అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. సినిమాకు చాలా విభిన్నంగా పబ్లిసిటీ చేయడంలో విజయ్ దేవరకొండ ముందుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా విడుదల రోజు స్వయంగా ట్యాక్సీవాలా అయ్యి ఎంతో మందిని గమ్యస్థానాలకు చేర్చుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు.